సూపర్ స్టార్ మహేష్ సినిమా షూటింగ్ లేకపోతే ఏం చేస్తారు ? కొత్తగా అడగాల్సిన పని లేదు, మీరూ చెప్పాల్సిన పని లేదు.అందరికి తెలిసిన విషయమే , భార్య పిల్లల్ని తీసుకొని విదేశాలు తిరుగుతారు.
స్విట్జర్లాండ్ కి మహేష్ వెళ్తున్నాడు అని వార్తలు వస్తే బ్రహ్మోత్సవం కొత్త షెడ్యుల్ ఏమైనా ప్లాన్ చేసారేమో అనుకున్నారంతా.కాని అలాంటిది ఏమి లేదు.
మహేష్ సన్నిహితులను ఆరాతీస్తే తెలిసింది.ఈ రోజు ఉదయమే మహేష్ స్విట్జర్లాండ్ బయలుదేరిపోయాడు.
మహేష్ తో పాటు నమ్రత, గౌతమ్, సితార ఉన్నారు.నిన్న రాత్రి ఆదిశేషగిరి రావు కొడుకు పెళ్ళికి హాజరైన సూపర్ స్టార్, బంధువులతో కాసేపు గడిపి అటునుంచి అటే, విమానాశ్రయం బయలుదేరాడు.
ఓ వారం పాటు స్విట్జర్లాండ్లోనే ఉంటాడట మహేష్.స్విట్జర్లాండ్ మహేష్ కి ఇష్టమైన ప్రదేశం అన్న విషయం తెల్సిందే.
హైదరాబాద్ తిరిగొచ్చిన తరువాత మళ్ళి బ్రహ్మోత్సవం షూటింగ్ లో బిజీ బిజీ గా గడపనున్నాడు సూపర్ స్టార్.తదుపరి షెడ్యుల్ లో సమంత కుడా యూనిట్ లో జాయిన్ అవుతుందని సమాచారం.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పివిపి సినిమా నిర్మిస్తోంది.రత్నవేలు చాయాగ్రహణం అందిస్తుండగా, మికి జే మేయర్ పాటల్ని, మణిశర్మ నేపథ్య సంగీతం సమకూరుస్తున్నారు.







