ఎన్టీఆర్ ని వాడుకునే పనిలో పవర్ స్టార్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంత బాగా పడతాడో మనందరికీ తెలిసిందే, యమ దొంగ, కంత్రి,అదుర్స్, రభస .ఇలా తన సినిమాల్లో పాటలు పాడి అభిమానుల్నే కాకుండా ప్రేక్షకులందరినీ అలరించారు ఎన్టీఆర్.

 Ntr To Sing For Puneeth Rajkumar ?-TeluguStop.com

ఇప్పుడు ఎన్టీఆర్ గొంతుని పవర్ స్టార్ వాడుకోవాలనుకుంటున్నాడు.నమ్మలేకపోతున్నా, ఇది నిజం !

కాని ట్విస్ట్ ఎంటంటే , ఎన్టీఆర్ గొంతుని వాడుకునేది మన తెలుగు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదు.

ఎన్టీఆర్ తో పాట పాడించుకోవాలనుకుంటున్నది కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్.మన మహేష్ బాబు దూకుడు చిత్రాన్ని రిమేక్ చేసి, సూపర్ స్టార్ తో తన ఆడియో ని లాంచ్ చేయించుకున్న ఈ హీరో ఇప్పుడు యంగ్ టైగర్ తో పాట పాడించుకుంటాడంట.

పునీత్ కొత్త చిత్రం “చక్రవ్యుహ”.దీనికి తమన్ సంగీత దర్శకుడు.

ఆ చిత్ర నిర్మాత లోహిత్ కి ఎన్టీఆర్ మంచి స్నేహితుడు.ఎన్టీఆర్ స్పెయిన్ నుంచి రాగానే పాట గురించి చర్చిస్తారట.

స్నేహితుడు కోసం ఎలాగో ఒప్పుకుంటాడు, పైగా తమన్ కి ఎన్టీఆర్ తో ఇప్పటికే పాట పాడించిన అనుభవం ఉంది.ఇక పునీత్ కొత్త చిత్రంలో ఎన్టీఆర్ పాట వినడం ఖాయం అని ఫిక్స్ అయిపోయారు కన్నడ సిని లవర్స్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube