మాస్ మహారాజ్ రవితేజ మంచి కలెక్షన్లు దండుకోని మెత్తబడ్డాడు.గురవారం రిలీజ్ అవడంతో, నాలుగు రోజుల వీకెండ్ లో మంచి కలెక్షన్లు రాబట్టుకుంది ఈ చిత్రం.
వీక్ డేస్ లో అనుకున్నట్టుగానే కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి.
ఈ రోజు నైజాం చప్పగా సాగగా, సీడేడ్, నెల్లూరు లో మాత్రం డీసెంట్ గా పరుగుని కొనసాగించింది.21కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరిగింది ఈ చిత్రానికి.లాభాలు రావడం మొదలవ్వాలంటే ఈ వారమంతా చెప్పుకోదగ్గ కలెక్షన్లు రావాల్సిందే.
మాస్ సినిమా కావడంతో మల్టిప్లేక్స్ లలో సపోర్టు పెద్దగా ఉండటం లేదు.మరీ ముఖ్యంగా హైదరాబాద్లో ఈ రోజు ఈ ఎఫెక్టు కనిపించింది.
గురువారం లోఫర్ ఉండటంతో రెండోవారం బెంగాల్ టైగర్ ఏమేరకు నిలదొక్కుకుంటుంది అనేది చూడాలి.డిస్ట్రీబ్యూటర్స్ కి కూడా ఇదే భయం పట్టుకుంది.
సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాధామోహన్ నిర్మించారు.తమన్నా, రాశిఖన్నా హీరోయిన్లుగా నటించగా, భీమ్స్ సంగీతం అందించారు.