ఎవరో ఒక వీరాభిమాని చావు బ్రతుకుల్లో ఉండటం, సదరు అభిమానికి అభిమాన హీరోని కలవాలనే కోరిక ఉండటం, అభిమాని చివరి కోరిక తీర్చడం కోసం హీరో బయలుదేరి పరామర్శించడం, మనం తరుచుగా చూస్తున్న విషయాలే ఇవి.
ఇందులో మానవత్వంతో పబ్లిసిటి స్టంటులు కూడా బాగానే ఉంటాయి.
ఎవరు ఏం చేసారు అనేది అప్రస్తుతం.విజయవాడకు చెందిన మస్తాన్ బీ అనే 67 ఏళ్ళ ముసలావిడ అల్లు అర్జున్ వీరాభిమాని అని, క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమెకు అల్లు అర్జున్ ని కలవడమే చివరి కోరిక అని కొన్ని టీ.వీ ఛానెల్లో కథనాలు ప్రసారితం చేసారు.
మన స్టైలిష్ స్టార్ ఈరోజు తన అభిమానిని కలవడానికి ఆవిడ ఇంటికి వెళ్ళాడు.
అయితే మొదటినుంచి ఇంట్లో లేని అల్లు అర్జున్ ఫోటోలు అల్లు అర్జున్ ఆమెతో దిగిన ఫోటోలో ప్రత్యేక్షమయ్యాయి.ఇంత సడెన్ గా ఫోటోలు ఎలా వచ్చాయనేది ఇప్పుడు అర్థంకాని విషయం.
అల్లు అర్జున్ పీ.ఆర్ టీమ్ వాళ్ళు కావాలని పెట్టించారా? ఈ విషయాన్ని గమనించకపోవడం అల్లు అర్జున్ తప్పేనా? ఏది ఏమైనా విమర్శకులకి అవకాశం ఇచ్చేసాడు బన్ని.







