లిక్కర్ నిషేధం మీద అప్పుడే జగన్ హామీ

ఏ నాయకుడైనా ఎన్నికల సమయంలో హామీలు ఇస్తాడు.అధికారంలోకి ఏమి చేయాలనుకున్నాడో ఎన్నికల ప్రచారంలో చెబుతాడు.

ఎన్నికల ప్రణాళికలో చేరుస్తాడు.కానీ వైకాపా అధినేత జగన్ అప్పుడే ఒక ఎన్నికల హామీ ఇచ్చేశాడు.

వచ్చే ఎన్నికల్లో తాను అధికారంలోకి వస్తానని , కుర్చీ ఎక్కిన వెంటనే లిక్కర్ను అంటే మద్యాన్ని నిషేదిస్తానని హామీ ఇచ్చాడు.విజయవాడలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు భాగస్వామిగా ఉన్న బార్లో మద్యం సేవించి అయిదుగురికి పైగా చనిపోయారు.

కొందరి పరిస్థితి విషమంగా ఉంది.ఇందుకు సంబంధించి పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు.

Advertisement

కృష్ణ లంకలోని బాధిత కుటుంబాలను జగన్ పరామర్శించాడు.ఈ సందర్భంగా లిక్కర్ నిషేధం మీద హామీ ఇచ్చాడు.

అయిదు నక్షత్రాల హోటళ్ళలో మాత్రమే లిక్కరుకు అనుమతి ఉంటుందని చెప్పాడు.అక్కడికి ధనికులు మాత్రమే వెళతారు కాబట్టి సమస్య ఉండదని చెప్పాడు.

బాధిత కుటుంబాలకు ఒక్కో దానికి 20 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాడు.చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని సొంత వ్యాపారం మాదిరిగా మార్చాడని విమర్శించారు.

గుజరాతులో లిక్కరును బ్యాన్ చేసిన కారణంగానే ఆ రాష్ట్రం అభివృద్ధిలో ముందంజలో ఉందని జగన్ చెప్పాడు.తనకు అధికారం అప్పగిస్తే మాత్రం మద్యం మాటే ఉండదని అన్నాడు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
కూటమి మేనిఫెస్టో చూసి విస్తుపోతున్న ఏపీ ప్రజలు.. ఇవి అమలు చేస్తే శ్రీలంక కాదా అంటూ?

వచ్చే ఎన్నికల్లో తన పార్టీ తప్పనిసరిగా గెలుస్తుందని జగన్ గట్టిగా నమ్ముతున్నాడు.సందర్భం దొరికినప్పుడు తన మనసులోని మాట బయట పెడుతున్నాడు.

Advertisement

తాజా వార్తలు