సంగీత దర్శకుడిగా కెరీర్ స్టార్ చేసిన దేవిశ్రీప్రసాద్ తెలుగు, తమిళంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు.త్వరలోనే సుకుమార్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాతగా హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు.
ఈ సినిమాలో దేవిశ్రీప్రసాద్ ప్రేయసి ఛార్మి గెస్ట్‌రోల్ కూడా చేయబోతుందని వార్తలు కూడా వినిపించాయి.ఈ వార్తలతో పాటు ఛార్మిని త్వరలోనే దేవిశ్రీ ప్రసాద్ పెళ్ళి చేసుకోబోతున్నాడని కూడా ఫిలింనగర్‌లో వార్తలు వినిపించాయి.
కానీ తీరా ఇప్పుడు మరో వార్త ఫిలింనగర్‌లో హాల్ చల్ చేస్తుంది.అదేంటంటే దేవిశ్రీ ప్రసాద్ మరో హీరోయిన్‌తో ప్రేమాయంణం సాగిస్తున్నాడని హాట్ న్యూస్ హాల్ చల్ చేస్తుంది.
ప్రణీతతో ఎక్కువ సేపు ఫోన్‌లో కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తుందట.ఈ వాలుకళ్ళ సొగసరి ప్రస్తుతం బ్రహ్మోత్సవం చిత్రంలో మహేష్ సరసన ముగ్గురి హీరోయిన్స్‌లో ఒకరిగా కనపడుతుంది.
ఇందులో నిజానిజాలు తెలియాలంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు నోరు విప్పితేనే కానీ అసలు నిజం తెలియదు.కానీ మొత్తం మీద ప్రేయసి ఛార్మికి దేవిశ్రీ హ్యండిచ్చాడని సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నారు.







