ఇప్పుడు సినిమాను ప్లానింగ్‌గా తీయాలనే ఆలోచన ఉంటే చాలు ఎవరైనా నిర్మాతలుగా మారవచ్చు.కావాల్సిందంతా మంచి ప్లానింగ్, దాన్ని మేనేజ్ చేయగలిగే మంచి టీమ్.
హీరోలు, దర్శకులు అందరూ నిర్మాతలుగా మారుతున్నారు.లేదా సినిమా ప్రొడక్షన్‌లో పార్టనర్స్‌గా మారుతున్నారు.
మహేష్‌బాబు, పవన్‌కళ్యాణ్, త్రివిక్రమ్, సంపత్‌నంది తో పాటు రీసెంట్‌గా దర్శకుడు సుకుమార్ కూడా నిర్మాతగా మారి నిర్మించిన కుమారి 21ఎఫ్ చిత్రం పెద్ద సక్సెస్ అయింది.ఇప్పుడు వీరందరి బాటలో మరో దర్శకుడు కూడా ప్రయాణించాలనుకుంటున్నాడట.
అతనే డైరెక్టర్ హరీష్ శంకర్.పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్‌తో ‘గబ్బర్‌సింగ్’ వంటి సూపర్‌హిట్ చేసిన ఈ డైరెక్టర్ తర్వాత తెరకెక్కించిన ‘రామయ్యా వస్తావయ్యా’ అట్టర్ ప్లాప్ కావడంతో సినిమా అవకాశాలు కరువయ్యాయి.
దాంతో గ్యాప్ తీసుకుని సాయిధరమ్ తేజ్‌తో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ మూవీతో సక్సెస్ సాధించాడు.ఇప్పుడు నెక్ట్స్ ఓ ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేస్తాడట.
తన ప్రొడక్షన్ హౌస్‌లో తొలి సినిమాను తనే డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడని టాక్.ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.







