యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంతో మరియు బాలకృష్ణ ‘డిక్టేటర్’ చిత్రాలతో బాక్సాఫీస్ ముందు సంక్రాంతికి ఢీ కొట్టబోతున్నారు అంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే.ముందే ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం సంక్రాంతికి రాబోతున్నట్లుగా నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్ ప్రకటించాడు.
తాజాగా ‘డిక్టేటర్’ చిత్రాన్ని కూడా సంక్రాంతికే విడుదల చేస్తాం అంటూ దర్శక నిర్మాత శ్రీవాస్ ప్రకటించాడు.దాంతో బాబాయి, అబ్బాయిల మధ్య తగ్గ పోరు ఖాయం అని అంతా భావించారు.
అందుకు నందమూరి ఫ్యాన్స్ కూడా సిద్దం అయ్యారు.కాని తాజాగా టాలీవుడ్ నుండి వినిపిస్తున్న గుసగుసల మేరకు ఈ పోరు జరగడం లేదని తెలుస్తోంది.
ఎన్టీఆర్ తన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాన్ని సంక్రాంతి రేసు నుండి తప్పించినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ఇంకా షూటింగ్ పార్ట్ బ్యాలన్స్ ఉన్న నేపథ్యంలో సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడం దాదాపు అసాద్యం అని అంటున్నారు.
జనవరి చివర్లో సినిమాను విడుదల చేసే వీలుందని కొందరు అంటున్నారు.సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొత్త లుక్‌లో కనిపించబోతున్న విషయం తెల్సిందే.
దాంతో నందమూరి ఫ్యాన్స్ ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయినా కూడా ఎన్టీఆర్ బాబాయితో ఢీ కొట్టడం ఇష్టం లేక సైడ్ అయ్యి పోయినట్లుగా తెలుస్తోంది.







