మహేష్ బాబు – కోన వెంకట్ కలిసి ఒకేఒక్క సినిమాకి పనిచేసారు.అదే దూకుడు.
ఇక దూకుడు ఎన్ని సంచలనాలు సృష్టించిందో కొత్తగా చెప్పనక్కరలేదు.అయితే దూకుడు విజయం సాధించాక మహేష్ ఎంతసేపు శ్రీనువైట్లనే పొగిడాడు తప్ప తన పేరు ఎత‍్తలేదని కోన బాహాటంగానే చెప్పాడు అప్పట్లో.
అప్పటినుంచే మహేష్ కి అటువైపు కూటమి పవన్ క్యాంప్ లో చేరాడు కోన.అప్పటినుంచి పవర్ స్టార్ భజన షురూ చేసిన కోన మహేష్ గురించి మాట్లాడింది చాలా తక్కువ.
మరి ఇన్నిరోజుల తరువాత ఏం గుర్తుకువచ్చిందో సూపర్ స్టార్ ని పొగడ్తలలో ముంచేసాడు ఈ స్టార్ రైటర్.ఇండస్ట్రీలో అగ్రహీరోలు కొత్త కథలను ఎంకరేజ్ చేస్తేనే ఇండస్ట్రీ బాగుపడుతని చెప్పిన కోన కొత్తదనాన్ని ఆహ్వానించే అగ్రహీరో ఎవరైనా ఉంటే అది మహేషే అని, తన నటనను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ధైర్యంగా స్క్రిప్టు ఎంచుకుంటాడని, ఈ విషయాన్ని శ్రీమంతుడు మరోసారి రుజువు చేసిందని ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు కోన.
మహేష్ మళ్లి అవకాశం ఇవ్వాలని కాకాపడుతున్నాడో లేక అవి గుండెలోంచి వచ్చిన మాటలో కోన వెంకట్ కి మాత్రమే తెలియాలి.







