గతంలో రామ్ చరణ్ హీరోగా, తమిళ దర్శకుడు ధరణి తో ఓ సినిమా ప్రారంభించారు.ఎన్వి ప్రసాద్, పరాస్ జైన్ ఈ సినిమాను నిర్మిస్తామన్నారు.
కాజల్ కథానాయిక.ఆ సినిమాకి మెరుపు అనే టైటిల్ అనుకున్నారు.
కారణాలు బయటకి తెలియకపోయినా, ఆ సినిమా పూజ కార్యక్రమాలతోనే ఆగిపోయింది.షూటింగ్ మొదలవలేదు.
ఆ తరువాత ఆ ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేసేసారు.
మళ్ళి రామ్ చరణ్ బ్రూస్ లీ కి ఓ దశలో “మెరుపు” అనే టైటిల్ అనుకున్నారు.
కాని ఆ టైటిల్ తో ఇప్పటికే ఓ సినిమా ఆగిపోయింది అని, బ్రూస్ లీ కే ఫిక్స్ అయిపోయారు.రామ్ చరణ్ కోసం అనుకున్న ఆ టైటిల్ ని ఇంతకాలం ఎవరు వాడలేదు.
కాని ఇప్పుడు ఆ టైటిల్ అవసరం తమిళ హీరో విజయ్ కి పట్టింది.
విజయ్ కొత్త చిత్రం ” తెరి “.
అట్లీ ఈ చిత్రానికి దర్శకుడు.ఈ మధ్యే ప్రారంభమైన ఈ చిత్రాన్ని తెలుగులో కుడా విడుదల చేస్తారట.
తెలుగు వెర్షన్ కోసం “మెరుపు” టైటిల్ ని పరిశీలిస్తున్నారని ఫిలిం నగర్ సమాచారం.ఈసారైనా ఈ టైటిల్ వాడుకుంటారో లేదో చూడాలి.







