ఏపీ మీద దయతలచిన కేంద్రం

ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద దయతలచింది.వానలతో , వరదలతో అతలాకుతలమైన రాష్ట్రానికి తక్షణ సాయంగా రూ.

1030 కోట్లు విడుదల చేసింది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారం రోజుల కిందట లేఖ రాస్తే ప్రభుత్వం ఇప్పుడు స్పందించింది.

ఏపీ కంటే ముందు తమిళనాడుకు సాయం చేసింది.దీంతో కేంద్రం పై అనేక విమర్శలు వచ్చాయి.

రెండు రాష్ట్రాలు ఒకే సమయంలో వరదలతో అపార నష్టానికి గురైనప్పటికీ ముందుగా తమిళనాడుకే సాయం చేసింది.బాబు వెంటనే సాయం కోసం లేఖ రాసినప్పటికీ పట్టించుకోలేదు.

Advertisement

రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్నాయి.ఆ సమావేశాల్లో మిత్ర పక్షమైన టీడీపీ సాయం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తే పరువు పోతుందనే భయంతో ఈ సాయం చేసి ఉండొచ్చు.

బాబు వెయ్యి కోట్ల సాయం అడిగితే కాస్త ఎక్కువగానే ఇచ్చారు.మంత్రి వెంకయ్య నాయుడు గట్టిగా కృషి చేసి ఉండొచ్చు.

ఆయన సొంత జిల్లా నెల్లూరు బాగా దెబ్బ తిన్నది.ఏది ఏమైనా సాయం చేయడం సంతోషం.

ఇది తక్షణ సాయం మాత్రమే.నష్టంపై నివేదిక పంపాక మరింత సహాయం చెయ్యాలి.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
కూటమి మేనిఫెస్టో చూసి విస్తుపోతున్న ఏపీ ప్రజలు.. ఇవి అమలు చేస్తే శ్రీలంక కాదా అంటూ?

మరి కేంద్రం ఇంతటితో సరిపెడుతుందా? మళ్ళీ సాయం చేస్తుందా? చూడాలి.AP gets Rs.

Advertisement

తాజా వార్తలు