మంచు హీరో మనోజ్ సరసన రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ముద్దుగుమ్మ తాప్సి తెలుగులో ‘రaుమ్మంది నాధం’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.ఆ సినిమా ఫలితం అటు ఇటు అయినా కూడా తాప్సి అందాలతో అవకాశాలు రాబట్టుకుంది.
ఆ తర్వాత కూడా ఈమెకు సరైన గుర్తింపు తెచ్చే సక్సెస్‌లు ఒక్కటి కూడా దక్కలేదు.దాంతో కొన్ని సంవత్సరాల పాటు గ్లామర్‌తో టాలీవుడ్‌లో నెట్టుకు వచ్చిన తాప్సి గత కొంత కాలంగా మొత్తానికి దూరం అయ్యింది.
తాజాగా ఈమె తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ.తెలుగు దర్శకులు మరియు నిర్మాతలు తన అందాన్ని చూపించేందుకు ప్రాముఖ్యతను ఇచ్చారు తప్ప, తనలోని నటిని ఏ దర్శకుడు కూడా వాడుకోలేదు అంటూ చెప్పుకొచ్చింది.
తాను నటించిన తమిళ ‘గంగ’ చిత్రం నటిగా మంచి గుర్తింపును తెచ్చి పెట్టిందని, హిందీలో సైతం తనకు నటిగా మంచి గుర్తింపు ఉందని ఈమె చెప్పుకొచ్చింది.ఇప్పటికి అయినా తనకు తెలుగులో ఆఫర్లు వస్తే చేసేందుకు సిద్దంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది.
హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలకు కూడా తాను సిద్దమే అని ఈమె క్లారిటీ ఇచ్చింది.మరి తెలుగు దర్శకులు ఇప్పటికి అయినా తాప్సిలోని అందాన్నే కాకుండా నటన అనే యాంగిల్‌ను కూడా ఉపయోగించుకుంటారేమో చూడాలి.







