ఎన్ డీ ఏ ను గెలిపిస్తేనే బీహార్లో అభివృద్ధా?

అవును ….ఎన్ డీ ఏకు అనుకూలంగా ప్రజలు తీర్పు ఇస్తేనే బీహార్ అభివృద్ధి చెందుతుందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు.

 Verdict For Nda In Bihar Would A Push For Development-TeluguStop.com

ఈ రాష్ట్రంలో ఎన్ డీ ఏను గెలిపిస్తే రాజ్య సభలో బలం పెరుగుతుందని, దాంతో కీలకమైన బిల్లులు ఆమోదం పొందే అవకాశం ఉంటుందని అన్నారు.బీహార్ ఎన్నికలు చాలా ప్రధానమైనవని, దేశ అబివృద్ది ఈ ఎన్నికల మీదనే ఆధార పడి ఉందని అన్నారు.

ఈ విషయం దృష్టిలో పెట్టుకొని ప్రజలు తమకు ఓటు వేయాలని కోరారు.రెండో దశ పోలింగ్ కోసం వెంకయ్య ప్రచారం చేస్తున్నారు.

ప్రజలు ఇతర కూటమిని గెలిపిస్తే అరాచకం ప్రబలుతుందని హెచ్చరించారు.ఒకవేళ గ్రాండ్ అలయన్సు అధికారంలోకి వస్తే నితీష్ కుమార్ పేరుకే ముఖ్యమంత్రిగా ఉంటారని, ఆయాన్ని వేరేవారు కంట్రోల్ చేస్తారని పరోక్షంగా లాలూ ప్రసాదును ఉద్దేశించి అన్నారు.

ఇక్కడ నితీష్, లాలూ, సోనియా పార్టీలు గ్రాడ్ అలయన్సు పేరుతో పోటీ చేస్తున్నాయి.వెంకయ్య చెప్పింది బీహార్ ప్రజలు వింటారా?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube