ఒక సినిమాకు నాయకుడు ఎంత అవసరమో, ప్రతినాయకుడు అంతే అవసరం.మెగాస్టార్ హీరో అంటే ఆయనకు తగిన ప్రతినాయకుడిని వెతకాలి కదా.
మెగాస్టార్ 150 వ సినిమాకి విలన్ దొరికేసాడట.
తమిళంలో పెద్ద విజయం సాధించిన కత్తి చిత్రాన్ని తెలుగులో వివి.
వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే.ఇటివలే స్థాపించిన కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు.
తమిళ కత్తిలో విజయ్ తో పోటీపడే విలన్ గా బాలివుడ్ యువనటుడు నీల్ నితిన్ ముకేష్ నటించాడు.పాత్రకోసం తమిళం నేర్చుకొని స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్న నీల్ నితిన్ ముకేష్ కి ఆ చిత్రం ద్వారా మంచి పేరొచ్చింది.
అదే బాలివుడ్ నుంచి మరో నటుడ్ని విలన్ గా దింపే ఆలోచనలో పడ్డాడు దర్శకుడు వినాయక్.
రామ్ గోపాల్ వర్మ రక్తచరిత్రలో హీరోగా చేసిన వివేక్ ఒబెరాయ్ గుర్తున్నాడుగా.
హృతిక్ రోషన్ క్రిష్-3 లో విలన్ గా కుడా చేసాడు.ఈ ఐశ్వర్యారాయ్ మాజీ ప్రియుడ్ని తెలుగు కత్తి కోసం విలన్ గా ఎంచుకున్నారట.క్రిష్-3 లో తన క్రూరత్వంతో మంచి పేరు సంపాదించుకున్న వివేక్ తెలుగులో ఏమేరకు అలరిస్తాడో చూడాలి.







