సుధీర్ బాబు ఎస్.ఏం.
ఎస్ తో తెలుగు తెరకు పరిచయమై ఇక్కడి యువతను తన చిరునవ్వుతో పడేసింది రెజినా.అడపాదడపా గ్లామర్ పాత్రలు చేసినా, ఎక్కువగా హోమ్లిగా కనిపించడం వలన పక్కింటి అమ్మాయి లాంటి ఇమేజ్ క్రియేట్ అయిపొయింది రెజినా మీద.ఇప్పుడు ఆ హోమ్లి ఇమేజ్ నుంచి బయటకు రావడానికి తెగ ప్రయత్నిస్తోందట … ఇదే విషయాన్ని ఇలా పంచుకుంది రెజినా.
“మొదటి నుంచీ నా మీద హోమ్లీ హీరోయిన్ అన్న ముద్ర పడిపోయింది.దాని నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్నాను.గ్లామర్‌గా కనిపించడం నాకు ఇష్టమే కాని గ్లామర్‌గా కనిపించడం అంటే చెప్పినంత తేలిక కాదు.దానికి చాలా హార్డ్ వర్క్ చేయాలి.నేను చేసిన హార్డ్ వర్క్ మీకు తెర మీద కనిపిస్తుంది.
అలా అని చెప్పి మితిమీరిన గ్లామర్‌కు ఎప్పుడూ ఒప్పుకోను.కథ, అందులో నా పాత్ర ఎంత డిమాండ్ చేస్తే, నా పరిధిలో ఆ డిమాండ్స్ ఉంటె తప్ప ఏది పడితే అది వేసుకోలేను.
బికినీ లాంటివి అయితే నాకు అస్సలు పడదు.అలాగని బికినీ వేసేవాళ్ళని తప్పుబట్టను .ఎవరి శరీరాకృతి వాళ్ళది.నా శరీర ఆకృతికి బికినీ సరిపడదు.అలాంటప్పుడు బికినీ ప్రయోగాలుచేసి నవ్వుల పాలు కావడం కన్నా దానికి దూరంగా ఉండడమే మంచిది.”
అయినా తెలుగు బికినీ ట్రెండ్ లా మారడానికి ఇంకా చాలా టైం ఉంది.







