అస్సాం మీద ఐ ఎస్ ఉగ్రవాదుల కన్ను

ఇస్లామిక్ స్టేట్ (ఐ ఎస్ ) ఉగ్రవాదులు ఇండియా మీద ఎప్పటినుంచో కన్ను వేసారని మీడియాలో కథనాలు వస్తున్నాయి.పోలీసుల, నిఘా వ్యవస్థల నుంచి వస్తున్న సమాచారం దీన్ని బలపరిచేదిగా ఉంది.

 Assam Has Second Highest Interest In Is Activities-TeluguStop.com

ఇండియాలో మొదటి చూపు జమ్మూ కాశ్మీర్ మీద ఉందని, తరువాత అస్సాంను ఎంచుకున్నారని తెలుస్తోంది.దీంతో అస్సాం పోలీసులు నిఘాను పటిష్టం చేసారు.

ఇంటర్నెట్ను కూడా జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు.జమ్మూ కాశ్మీర్లో ఇంటర్నెట్ బంద్ పెట్టినట్లు వార్తలు వచ్చాయి.

ఐ ఎస్ ఉగ్రవాదుల రెండో లక్ష్యం అస్సాం అని నిఘా సంస్థ దేశ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో తేలింది.అస్సాంలో ఇంటర్నెట్లో ఐ ఎస్ ఫోటోలకు ఎక్కువ హిట్స్ వస్తున్నాయి.

అయితే ఇప్పటివరకు రాష్ట్రంలో ఐ ఎస్ సభ్యలు లేరని పోలీసు అధికారులు చెబుతున్నారు.మొత్తం మీద ఐ ఎస్ ఉగ్రవాదులు ఎప్పుడో ఒకప్పుడు దేశాన్ని అల్లకల్లోలం చేసే పరిస్థితి కనబడుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube