గుణశేఖర్ ఉన్నదంతా ఉడ్చి, ఏంతో శ్రమకు ఓర్చి, నిద్రాహారాలు మాని చెక్కిన చిత్రం రుద్రమదేవి .ఈ ఏడాది మొదట్లోనే రావాల్సిన’ ఈ సినిమా ఎన్నో తేదీలు మార్చుకుంటూ, మళ్ళి వాయిదా పడుతూ వస్తోంది .
ఎట్టకేలకు అక్టోబర్ 9న ఖచ్చితంగా విడుదల చేస్తాను అని చెప్పారు గుణశేఖర్.
అక్టోబర్ 9 రిలీజ్ డేట్ తో ప్రింట్ మీడియా ఆడ్స్ ఇచ్చిన గుణశేఖర్, హిందీ లో కుడా సినిమాను ప్రమోషన్ ను మొదలుపెట్టారు .ఇక అక్టోబర్ 9న ఖచ్చింతంగా వస్తోంది అని అనుకుంటున్న తరుణంలో రుద్రమదేవి మళ్ళి వాయిదా పడుతోందని గాలి వార్తలు వినిపించాయి.
చిరంజీవి బ్రూస్లీ కోసం సినిమా వాయిదా వేయాలని గుణశేఖర్ ని కోరారని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అవకపోవడం వల్ల వాయిదా వేస్తున్నారని కథనాలు వినిపించాయి .అయితే ఇవన్ని గాలి వార్తలే తప్ప వాస్తవాలు కాదని యూనిట్ వర్గాలు తెలియజేసాయి .
ఇప్పటికే సెన్సార్ పనులు పూర్తిచేసుకొని యు/ఏ సర్టిఫికేట్ పొందిన రుద్రమదేవి ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 9న విడుదల అవుతోంది .దీనికి సంబంధించిన ప్రెస్ నోట్ త్వరలోనే యూనిట్ విడుదల చేయనుంది.







