సాధారణంగా హీరో కన్నా అభిమానులకే రికార్డ్స్ పిచ్చి ఎక్కువ ఉంటది .ఆ రికార్డ్స్ కోసం సొంత డబ్బు పెట్టేందుకు కుడా వెనుకాడరు .
ఒకప్పుడంటే సినిమా హిట్ రేంజ్ ని 50 రోజులు ఎన్ని సెంటర్స్ లో జరుపుకుంది, 100 రోజులు ఎన్ని సెంటర్స్ లో ఆడింది అనే విషయాన్ని బట్టి కొలిచేవారు .ఇప్పుడు పరిస్థితులు మారాయి, సినిమా ఎన్ని సెంటర్స్ లో 50 రోజులు ఆడింది అనేదానికన్నా, ఎన్ని సెంటర్స్ లో రిలీజ్ చేసారు ? మొదటి రోజు ఎంత ? మొదటి వారం ఎంత అనేదాన్ని బట్టే సినిమా రేంజ్ డిసైడ్ చేస్తున్నారు.సూపర్ స్టార్ శ్రీమంతుడు అత్తారింటికి దారేది మొదటి వారం రికార్డుని నాలుగు రోజుల్లో, ఫుల్ రన్ షేర్ ని 15 రోజుల్లో దాటేసింది… ఏ రకంగా చుసినా ఇది అసామాన్యమైన రికార్డు … కాని మహేష్ అభిమానులు ఇంకా సంతృప్తి చెందినట్టు లేరు.
హైదరాబాద్ లో శ్రీమంతుడు మెయిన్ థియేటర్ సంధ్య 35 లో శ్రీమంతుడు ని 100 రోజులు ఆడించాలని మహేష్ కి విన్నపించుకున్నారట … కాని మహేష్ ఈ పనికిరాని రికార్డ్స్ వెంట పడొద్దు, 100 రోజులు ఆడించి సాధించేది ఏమి ఉండదు అని నచ్చజెప్పి పంపించేసాడట .మరి అభిమానులు మహేష్ మాట వింటారో లేక పిచ్చి ముదిరి సొంత డబ్బులతో 100 రోజులు ఆడిస్తారో చూడాలి !







