వెర్రి వెయ్యి విధాలు .అందులో సినిమా వెర్రి లాంటి వెర్రి ఇంకోటి ఉండదు .
ఎంత పిచ్చి కాకపొతే డైరెక్టర్ ఇంటి ముందు ఒక అమ్మాయి అర్థరాత్రి హంగామా చేయడమేంటి ! ఏం జరిగిందో తెలుసుకోవాలంటే విషయాన్ని పూర్తిగా చదవండి,
ఆ అమ్మాయి పేరు బయటకి చెప్పలేదు కాని, తను వరంగల్ జిల్లాలోని కోనాపూర్ ప్రాంతానికి చెందిన నర్సంపేటలోని ఓ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది.వయసు 19 సంవత్సరాలు.
సినిమా అంటే పిచ్చి, ఎలాగైనా పెద్ద హీరోయిన్ కావాలని బలమైన కోరిక.అందులోనూ డైరెక్టర్ పూరి జగన్నాధ్ వీరాభిమాని.
ఎలాగైనా పూరి జగన్నాధ్ ని కలిసి హీరోయిన్ అయిపోవాలని హైదరాబాద్ బస్సు ఎక్కేసింది.ఎంత ధైర్యం కాకపోతే, ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయలుదేరింది ఆ గడుసరి.
అర్థరాత్రి ట్యాక్సీ పట్టుకొని పూరి జగన్నాధ్ ఇంటికెళ్ళి అక్కడే కుర్చుందట.తెల్లారాక ఆయన్ని కలిసి హీరోయిన్ అవకాశం కొట్టేయాలని అమ్మడి ఆశ.అయితే అర్థరాత్రి యువతి అనుమానాస్పదంగా కనిపించడంతో సమీపంలోకి సెక్యూరిటీ గార్డ్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.జూబ్లీహిల్స్ పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకుని, ఆమె తండ్రిని హైదరాబాద్‌కు పిలిపించి అప్పగించారు తిరిగి ఇంటికి పంపించేసారు.
పూరి జగన్నాధ్ సినిమాలో హీరోకి కుడా ఇంత తిక్క ఉండదేమో కదా !