ఆడియో ఫంక్షన్ అనగానే పాటలు ఎలా ఉండబోతున్నాయి అనే రోజులు పోయి, హీరోని ఎవరు ఎక్కువ పొగుడుతారు, భజన ఎంత మంది చేస్తారు అనే ఆలోచించే రోజులొచ్చాయి.రేపు అఖిల్ సినిమా ఆడియో ఫంక్షన్ జరుగుతోంది.
సూపర్ స్టార్ మహేష్ ఆడియో ఫంక్షన్ చీఫ్ గెస్ట్ .అంతా బాగానే ఉంది .కాని రేపు భజన ఎవరికీ చేస్తారు ?
ఇష్క్ సినిమా ఆడియో ఫంక్షన్ గుర్తు ఉంది కదా .పవర్ స్టార్ కి పిచ్చి ఫ్యాన్ అయినా నితిన్, తన సినిమా కన్నా పవన్ భజన చేయడంలోనే సమయాన్ని గడిపాడు.అక్కినేని అఖిల్ మహేష్ బాబు వీరాభిమాని అని ఇప్పటికే చాలా సార్లు నాగార్జున చెప్పాడు … మరి రేపు అఖిల్ ఏం చేస్తాడో?
తన సినిమా గురించి, అక్కినేని అభిమానుల గురించి, నాగార్జున గురించి చెబుతాడా లేక మహేష్ భజన చేస్తూ కూర్చుంటాడా ? మరోవైపు పవర్ స్టార్ అభిమాని, అఖిల్ నిర్మాత, నితిన్ ఏం చేస్తాడో ? పవర్ స్టార్, సూపర్ స్టార్ నా రెండు కనుల లాంటి వారు అంటాడా ? అఖిల్ ఆడియో ఫంక్షన్ కాస్తా సూపర్ స్టార్, పవర్ స్టార్ భజన ఫంక్షన్ గా మారిపోతుందా ?
ఇదంతా ఏమి ఉండకపోవచ్చు .నాగార్జున ఇద్దరి స్పీచ్ లకు ఈ రోజే సెన్సార్ చేసి ఉంటారు !
.






