సెలెబ్రిటీ కిడ్స్ ఏం చేసినా మీడియా దాన్ని భూతద్దంలో చూపిస్తుంది.ఇప్పుడు సూపర్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ; బాలీవుడ్ మెగాస్టార్ మనవరాలు నవ్యా నవేలి కలిసి దిగిన ఒక ఫోటో మీడియా లో తెగ హల్ చల్ చేస్తుంది.
ఆర్యన్ ; నవ్యా ఇద్దరూ లండన్ లో ఒకే స్కూల్ లో చదువుకుంటున్నారు.వీరిద్దరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాత్రమే కాదు మంచి స్నేహితులు కూడా.
లండన్‌లోని సెవెన్ ఓక్స్ స్కూల్లో ఆర్యన్, నవ్య చదువుతున్నారు.ఇద్దరూ కలిసి దిగిన సేల్ఫీ ఫోటో ను నవ్యా అప్ లోడ్ చేసింది.
అచ్చు షా రుఖ్ లానే ఉన్న ఆర్యన్ ను చూసి ఫాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.కొన్నాళ్ళ క్రితం వీళ్ళ లాగే ఉన్న ఇద్దరు టీనేజర్స్ కు సంభందించిన ఎంఎంఎస్ క్లిప్ వైరల్‌లా వ్యాపించింది.
దాన్ని పట్టుకుని మీడియా తెగ హడావిడి చేసింది.అయితే ఆ తర్వాత రియల్ కాదని, ఫేక్ ఎంఎంఎస్ క్లిప్ అని తేలిపోయింది .
ఏది ఏమైనా స్టార్ వారసులకు సంబంధించిన విషయం కావడంతో ఈ ఫోటో అందరికీ ఆశ్చర్యాన్ని కొంత అనుమానాన్ని కూడా కలిగిస్తుంది
.