అక్కినేని ప్రిన్స్ ‘అఖిల్’ మూవీ ఆడియో ఈనెల 20న భారీ ఎత్తున జరుగనున్న విషయం తెల్సిందే.ఈ ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా సూపర్ స్టార్ మహేష్‌బాబు హాజరు కాబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది.
మహేష్‌బాబు చేతుల మీదుగా ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహించి, పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా ప్లాటినం డిస్క్ ఫంక్షన్‌ను నిర్వహించాలని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.ఈనెల 20 ఆడియో విడుదల కార్యక్రమం జరుగనుండగా, వచ్చే నెల 9న వినాయక్ పుట్టిన రోజున పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా ప్లాటినం డిస్క్ వేడుక చేస్తారట.
దాదాపు మూడు సంవత్సరాలుగా అక్కినేని ఫ్యాన్స్ అఖిల్ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు.కాస్త లేట్ అయినా కూడా అఖిల్‌ను భారీ స్థాయిలో పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో నితిన్ నిర్మాణంలో వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమాను నాగార్జున చేయిస్తున్నాడు.
దసరా కానుకగా వచ్చే నెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో నాగార్జున, అమలా, నితిన్‌లు గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.







