అనుష్క కూడా విడియో రిలీజ్ చేస్తుందట

బొమ్మాలి అనుష్క సినిమాల్లోకి రాకముందు యోగా టీచర్ అన్న సంగతి తెలిసిందే కదా … ఆ యోగా రావడం వల్లేనేమో ఏ పాత్ర ఎలా డిమాండ్ చేస్తే అలా మారిపోతోంది అనుష్క.బాహుబలి లో ముసలి దేవసేన పాత్రకు బరువు పెరిగిన అనుష్క, యుక్త వయసులో ఉండే దేవసేన పాత్రకు బరువు తగ్గింది.

 Anushka To Release Her Yoga Video-TeluguStop.com

రుద్రమదేవి కోసం బరువు తగ్గి, సైజ్ జీరో కోసం బరువు పెరిగి, మళ్ళి అదే సినిమాలో ఇంకో షేడ్ కోసం బరువు మళ్ళి తగ్గింది.

ఇలా బరువు పెరుగుతూ, తరుగుతూ ఉంటే ఆరోగ్యం దెబ్బతినదా అంటే .అక్కడే ఉంది కదా … సామాన్యులకు, యోగా అభ్యసించినవారికి తేడా .యోగాలో నేర్పరి కాబట్టే .ఎలాంటి పద్దతులు పాటించాలో అలాంటి పద్ధతులు పాటించి, ఆరోగ్యం దెబ్బతినకుండా తన శరీరాకృతిని మార్చుకుంది అనుష్క.

ఇప్పుడు తనకున్న జ్ఞానాన్ని అందరికి పంచేందుకు సిద్ధమవుతోంది అనుష్క ఇంతకు ముందు శిల్పా శెట్టి తన సొంత యోగా విడియోని విడుదల చేసినట్టుగా, అనుష్క కుడా తన సొంత యోగా డి.వి.డి రిలీజ్ చేసే సన్నాహాల్లో ఉందట.ఇంకేం .ఆ విడియో చూసే కుర్రకారుకి అందంతో పాటు జ్ఞానం కుడా దొరుకుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube