కాదేది కవితానర్హం అన్నాడు ఓ మహా కవి.ఈ మాటను సీరియస్ గా తీసుకున్నరేమో కోన వెంకట్,నిఖిల్.
చిత్రమైన ప్రమోషన్ పంథా ను ఎంచుకున్నారు తమ రాబోయే చిత్రం “శంకరాభరణం” కోసం.అయితే ఆ ప్రయత్నం రకరకాల అనుమానాలని రేపుతోంది.
ఈ రోజు శంకరభరణం కి సంబంధించి ఒక విడియో లీక్ అయిందని ట్విట్టర్ లో గగ్గోలు పెట్టారు కోన వెంకట్, నిఖిల్.థియేటర్లో చూసి ఆనందిస్తారు ప్రేక్షకులు అని అనుకున్నాం, కాని ఇలా అయిపొయింది, అయినా సరే వాళ్ళు ఇప్పటికి కుడా ఎంజాయ్ చేస్తారు అని తెగ బాధపడ్డారు.
కాని విడియో ఎలా లీక్ అయింది ?
లీక్ అయిన విడియోను ముందే అఫీషియల్ వెబ్ సైట్స్ ఎలా పెట్టాయి ? అంటే ముందే విడియో పంపించారా ? కావాలనే ఈ రకంగా ప్రమోట్ చేయలనుకున్నారా ?
చుస్తే అలానే అనిపిస్తోంది … లీక్ అయిన వీడియోస్ ని అఫీషియల్ గా పంపించరు.కాని శంకరాభరణం యూనిట్ పంపించింది.
పంపించిన విడియో ని అన్ని అఫీషియల్ వెబ్ సైట్స్ పోస్ట్ చేసాయి.ఇదే అనుమానాలకి తావు ఇస్తోంది.
ఏది ఏమైనా … సినిమా ప్రచారం లో ఇదో సరికొత్త పంథా .ఎవరికీ నచ్చినా .నచ్చకపోయినా.







