ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక సినిమా పెద్ద హిట్ అయిందంటే … మొదటి వారం హీరో చూసుకుంటాడు, రెండో వారం నుంచి లాగాల్సింది ప్రేక్షకులే.మూడో వారం నుంచి కలెక్షన్లు తగ్గుముఖం పడతాయి … నాలుగో వారం ఎదో ఉంది అంటే ఉంది అన్నట్టు ఉంటుంది సినిమా .
కాని మళ్ళి సినిమాకి జనాల్ని రాప్పించాలంటే …
50 రోజుల తర్వాత మగధీరలో కొత్త సన్నివేశాలు జత చేసారు .అత్తారింటికి దారేది లో కుడా అంతే .ఇప్పుడు ఇదే ప్లాన్ అమలుపరచనున్నారు శ్రీమంతుడు మేకర్స్.థియేటర్లకు జనాల్ని మళ్ళి రప్పించే ప్రయత్నంలో పడ్డారు కొరటాల అండ్ కంపెనీ.
రేపటి నుంచి శ్రీమంతుడు లో రెండు కొత్త సన్నివేశాలు కనిపించానున్నాయి.అందిన సమాచారం ప్రకారం ఒకటి సంపత్ రాజ్ రాజేంద్ర ప్రసాద్ కుటుంబానికి వార్నింగ్ ఇచ్చే సన్నివేశం.
మరొకటి రాజేంద్ర ప్రసాద్ తన కుటుంబంతో ఊరు వదిలి వెళ్ళాలనుకోవడం.ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.
సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా రేపటి నుంచి శ్రీమంతుడు థియేటర్ల వద్ద సందడి చేస్తారన్నమాట.ఏ మేరకు కలెక్షన్లు పెరుగుతాయో చూడాలి మరి.







