మహేష్‌, జక్కన్న మూవీపై పుకార్లు

ఆలూ లేదు, సూలూ లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఉంది ప్రస్తుతం టాలీవుడ్‌లో వినిపిస్తున్న ఒక వార్త కథనం చూస్తుంటే.‘బాహుబలి’ సినిమాతో రికార్డులను బ్రేక్‌ చేసిన టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తాను మహేష్‌బాబుతో ఒక సినిమా చేయాల్సి ఉందని, త్వరలోనే చేస్తాను అంటూ ప్రకటించిన విషయం తెల్సిందే.

 Nayanatara In Mahesh-rajamouli Movie..?-TeluguStop.com

ఆ సినిమా ఎప్పుడుంటుందో, ఎలా ఉంటుందో తెలియనే లేదు అప్పుడే ఆ సినిమా గురించిన రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి.

మొన్నటికి మొన్న మహేష్‌బాబుతో రాజమౌళి తెరకెక్కించబోతున్న సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తాడు అంటూ ప్రచారం జరిగింది.

తాజాగా ఈ సినిమాలో మహేష్‌బాబుకు జోడీగా నయనతార హీరోయిన్‌గా నటించనుంది అంటూ వార్తలు వస్తున్నాయి.ఇటీవలే మహేష్‌, రాజమౌళిలతో సినిమా చేయబోతున్న నిర్మాత కేఎల్‌ నారాయణ హీరోయిన్‌ పాత్ర కోసం నయన్‌ను సంప్రదించినట్లుగా ఫిల్మ్‌ సర్కిల్స్‌ నుండి సమాచారం అందుతోంది.

ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కాని మహేష్‌బాబు, రాజమౌళిల సినిమా వార్త అయ్యే సరికి భారీగా క్రేజ్‌ను సంతరించుకుంది.జక్కన్న ‘బాహుబలి’ రెండవ పార్ట్‌ పనిలో బిజీగా ఉన్నాడు.

ఈ నేపథ్యంలో వేరే సినిమాల గురించి ఆలోచించే ప్రసక్తే లేదు.మరి హీరోయిన్‌ ఎంపిక ఎలా అయ్యిందో.!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube