రోషన్‌కు నాగ్‌ అతిథిగా ఆశీస్సులు

నాగార్జున ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నాడు.ఆ తర్వాత ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ మూడవ సీజన్‌ను ప్రారంభించేందుకు సిద్దం అవుతున్నాడు.

 Nagarjuna To Act With Srikanth Son-TeluguStop.com

ఇంత బిజీలో కూడా ఒక సినిమాలో గెస్ట్‌ పాత్రలో నటించేందుకు నాగార్జున ఓకే చెప్పాడు.శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా పరిచయం కాబోతున్న చిత్రంలో నాగార్జున చిన్న పాత్ర పోషించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

శ్రీకాంత్‌పై ఉన్న అభిమానంతో రోషన్‌ మొదటి సినిమాలో నాగార్జున నటించబోతున్నాడు.

హీరోగా 100కు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన శ్రీకాంత్‌ గత కొంత కాలంగా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు.

హీరోగా సక్సెస్‌లు లేని శ్రీకాంత్‌ తన కొడుకుని రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.ఇప్పటికే పలు స్క్రిప్ట్‌లు కూడా వినడం జరిగిందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

శ్రీకాంత్‌కు ఇండస్ట్రీ టాప్‌ హీరోలు అయిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, నాగార్జునలతో కలిసి నటించిన అనుబంధం ఉంది.దాంతో రోషన్‌ సినిమా ప్రమోషన్‌కు ఆ అనుబంధం కలిసి రావచ్చు అని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube