మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు సైతం చిరు 150వ సినిమా కోసం ఎదురు చూస్తున్న వారిలో ఉన్నారు.
ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహించేందుకు పదుల సంఖ్యలో పోటీ పడుతున్నారు.నిర్మాతు సైతం ఎంతో మంది ఉండగా, చరణ్ ఆ అవకాశం ఎవరికి ఇవ్వను అని, తానే చిరు 150వ సినిమాను నిర్మిస్తాను అంటూ ఇప్పటికే ప్రకటించాడు.
ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ప్రముఖ నిర్మాత ఆసక్తి చూపుతున్నారు.
నైజాం ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లలో ఒక్కడైన దిల్‌రాజు ఇప్పటికే చిరంజీవి 150వ సినిమాను పంపిణీ చేసేందుకు చరణ్‌తో మాట్లాడినట్లుగా తొస్తోంది.
చరణ్‌కు ఎప్పుడంటే అప్పుడు బ్లాంక్ చెక్‌ను ఇచ్చేందుకు దిల్‌రాజు సిద్దంగా ఉన్నాడు.ఎంత మొత్తం అయినా నైజాం ఏరియాలో చిరంజీవి 150వ సినిమాను దిల్‌రాజు తీసుకోవడం ఖాయంగా తొస్తోంది.
ఇదే విషయాన్ని తాజాగా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ మూవీ ఆడియో వేడుకలో దిల్ ప్రకటించాడు.చిరు 150వ సినిమా ప్రారంభానికి మరో రెండు మూడు నెలు పట్టే అవకాశాున్నాయి.
దర్శకుడు, హీరోయిన్ ఎవరు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.







