సూపర్ స్టార్ మహేష్‌బాబు ‘శ్రీమంతుడు’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని, రికార్డు స్థాయి కలెక్షన్స్‌ను రాబడుతూ దూసుకు పోతుంది.ఇప్పటికే ప్రంపచ వ్యాప్తంగా దాదాపుగా 135 కోట్ల గ్రాస్‌ను దక్కించుకున్న ఈ సినిమా టాలీవుడ్ నెం.2కు చేరువలో ఉంది.లాంగ్ రన్‌లో రికార్డులు చేరడం ఖాయం అని ఇప్పటికే తేలిపోయింది.
ఇక ఈ సినిమాను ఇంత భారీ సక్సెస్ చేసినందుకు ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలను చెప్పేందుకు మహేష్‌బాబు ఆసక్తిని చూపుతున్నట్లుగా తెలుస్తోంది.అందుకే నిర్మాతలు థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేయబోతున్నారు.
ఈనెల 20వ తారీకున ఈ సినిమా థ్యాంక్స్ మీట్‌ను హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిపేందుకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి.ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ కృష్ణ కూడా పాల్గొనే అవకాశాలున్నాయని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
ఇదే వేదికపై మహేష్‌బాబు తాను బుర్రి పాలెంను దత్తత తీసుకోబోతున్నట్లుగా ప్రకటించనున్నాడు అంటూ సినీ వర్గాల ద్వారా ప్రచారం జరుగుతోంది.‘శ్రీమంతుడు’ సక్సెస్‌తో ఎంత హ్యాపీగా ఉన్నాడో గత కొన్ని రోజులుగా ఆయన పాల్గొంటున్న మీడియా సమావేశాలే చెబుతున్నాయి.
జీవితంలో ఇంత ఆనందం ఎప్పుడు లేదు అంటూ మహేష్‌బాబు పదే పదే చెబుతున్నాడు.కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్‌గా శృతిహాసన్ నటించిన విషయం తెల్సిందే.







