బాహుబలి తెలుగు సినిమా లేక్కల్నే కాదు చాలా జీవితాల్నే మార్చేసింది .తెలుగు ప్రేక్షకులకి మాత్రమే పరిచయమున్న ప్రభాస్ నేడు బాలివుడ్ జనాలకి కుడా తెలిసిపోయాడు.
బాహుబలి ప్రభావం వాళ్ళ ప్రభాస్ సినిమాల డబ్బింగ్ హక్కులకై మలయాళం లో క్రేజ్ ఏర్పడింది.ఇన్ని రోజులు తెలుగు రాష్ట్రాలు దాటితే మహేష్ పేరు మాత్రమే గట్టిగా వినిపించేది.
కాని పోటిలో నేనున్నాను అంటున్నాడు ప్రభాస్.
ఇక వాణిజ్య ప్రకటనల్లో మకుటం లేని మహారాజు సూపర్ స్టార్ .అక్కడ కుడా బోణి కొట్టాడు ప్రభాస్.మహీంద్రా కి నూతన ప్రచారకర్తగా ఎంపికయ్యాడు ప్రభాస్.
ఫ్యాన్ ఫాలోయింగ్ లో ఇప్పట్లో మహేష్ అందుకోడం ఇప్పట్లో కష్టమైనా విషయమే అయినా, పాపులారిటీ పరంగా మహేష్ కి పోటి ఇవ్వగలిగేది ప్రభాస్ మాత్రమే అంటున్నారు సినీ జనాలు.
ఇదిలా ఉంటే బాహుబలి వల్ల స్టార్స్ కి వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు అని ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చాడు మన సూపర్ స్టార్.







