అఖిల్‌ ఆ అరుదైన రికార్డును అందుకుంటాడా?

అక్కినేని ఫ్యాన్స్‌ అఖిల్‌ మొదటి సినిమా కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.రెండు సంవత్సరాల ఎదురు చూపుల తర్వాత కొన్ని నెలల క్రితం అఖిల్‌ మొదటి సినిమా వినాయక్‌ దర్శకత్వంలో ప్రారంభం అయ్యింది.

 Akhil Movie Crossed 40 Crores Budget-TeluguStop.com

నితిన్‌ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.ప్రస్తుతం అఖిల్‌ మూవీ నిర్మాణం చివరి దశకు చేరుకుంది.

దసరా కానుకగా ఈ సినిమా అక్టోబర్‌ 21న విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇక ఈ సినిమాతో అఖిల్‌ ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.

ప్రస్తుతం ఉన్న ఏ స్టార్‌ హీరో మొదటి సినిమా కూడా ఇంత భారీ స్థాయి బడ్జెట్‌తో తెరకెక్కింది లేదు.ప్రస్తుతం ఉన్న స్టార్‌ హీరోలు మాత్రమే 40 కోట్ల బడ్జెట్‌ను క్రాస్‌ చేస్తున్నారు.

కాని అఖిల్‌ తన మొదటి సినిమాతోనే ఏకంగా 40 కోట్ల బడ్జెట్‌ను క్రాస్‌ చేసి సినీ వర్గాలను షాక్‌ అయ్యేలా చేస్తున్నాడు.ఇక టాలీవుడ్‌లో ఏ స్టార్‌ హీరో కూడా మొదటి సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను అందుకోలేదు.

ఎంతో మంది యావరేజ్‌ సినిమాలను ఇవ్వగా మరి కొందరు ఫ్లాప్స్‌తో సరిపెట్టుకున్నారు.అయితే అఖిల్‌ మాత్రం బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను కొట్టడం ఖాయం అంటూ అభిమానులు మరియు చిత్ర యూనిట్‌ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మొదటి సినిమాతో సూపర్‌ హిట్‌ దక్కించుకుంటే అఖిల్‌కు ఈ అరుదైన రికార్డు దక్కడం ఖాయం.ఇంకా టైటిల్‌ ఫిక్స్‌ కాని ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ టీజర్‌ ఈనెల చివర్లో, ఆడియో సెప్టెంబర్‌లో విడుదల కాబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube