రెండున్నర సంవత్సరాల క్రితం విడుదలైన ‘మిర్చి’ సినిమా మలయాళంలో త్వరలో విడుదలయ్యేందుకు సిద్దం అవుతోంది.‘మిర్చి’ సినిమాను అక్కడ సంవత్సరం క్రితమే విడుదల చేయాలని అనుకున్నారు.
అయితే అప్పుడు ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో బిజినెస్ కాలేదు.కొన్ని ఏరియాల్లో అసలు డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రాలేదు.
అదే సమయంలో ‘బాహుబలి’ సినిమా తెరకెక్కుతుంది.మలయాళంలో ‘బాహుబలి’ సినిమా విడుదల తర్వాత ‘మిర్చి’ని విడుదల చేయవచ్చనే ఉద్దేశ్యంతో నిర్మాత అప్పుడు వాయిదా వేశాడు.
తాజాగా ‘బాహుబలి’ సినిమా మలయాళం బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో వసూళ్లను కొల్లగొట్టింది.దాంతో ప్రభాస్ మరియు అనుష్కలకు మంచి క్రేజ్ వచ్చింది.
‘మిర్చి’ని ఇప్పుడు ‘బాహుబలి’ స్టార్స్ నటించిన సినిమా అంటూ ప్రచారం చేస్తూ విడుదలకు సిద్దం చేస్తున్నారు.ఇప్పటికి కూడా కేరళలో ‘బాహుబలి’ సినిమా కొన్ని థియేటర్లలో ఆడుతోంది.
అందువల్ల ‘బాహుబలి’ తీసి వేయగానే వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ‘మిర్చి’ మలయాళ వర్షన్‌ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.







