‘శ్రీమంతుడు’ సినిమాపై సెన్సెషనల్ కామెంట్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించిన వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఉన్నట్లుండి తన మాటను మార్చాడు.మొన్నటికి మొన్న ‘శ్రీమంతుడు’ విడుదలైన తర్వాత ‘బాహుబలి’ కలెక్షన్స్ మళ్లీ పెరుగుతాయి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెల్సిందే.
అయితే తాజాగా ‘శ్రీమంతుడు’ సినిమాను నెత్తిన ఎత్తుకుని ప్రచారం చేశాడు.ఆహా.ఓహో.అంటూ ‘శ్రీమంతుడు’పై ప్రశంసలు కురిపించాడు.
వర్మ ట్విట్టర్‌లో.‘బాహుబలి’ తర్వాత వచ్చిన ‘బాహుబలి’ సింప్లీ సూపర్ అంటూ ట్వీట్ చేశాడు.100ల కోట్లు పెట్టి 100ల రోజులు తీసిన సినిమాల కంటే, విజువల్ వండర్స్ సీన్స్‌తో పోల్చితే మహేష్‌బాబు రెండు మూడు క్లోజప్ సీన్స్ ఎంతో ఇంపాక్ట్‌ను ఆడియన్స్‌పై క్రియేట్ చేయగలవు అంటూ వర్మ ఆసక్తికర ట్వీట్స్ చేశాడు.వర్మ ఎప్పుడు ఎలాంటి ట్వీట్స్ చేస్తాడో ఆయనకే తెలియకుంది.
మొదట వర్మ ట్వీట్స్‌పై ఆసక్తి చూపిన ఆయన ఫాలోవర్స్ ఇప్పుడు ఆయన ట్వీట్స్‌ను పట్టించుకోవడం మానేశారు.







