మంచు విష్ణు హీరోగా, ప్రణీత హీరోయిన్‌గా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ‘డైనమైట్’ సినిమా ఇప్పటికే విడుదలకు సిద్దం అయ్యింది.ఈ సినిమా ‘బాహుబలి’ వల్ల కాస్త ఆలస్యం అవుతోంది.
ముందుగా అనుకున్నదాని ప్రకారం ఈ సినిమాను జులై 7న విడుదల చేయాలని భావించారు.కాని ‘బాహుబలి’కి వారం ముందు రావడం కొరివితో తల గోక్కోవడం అని భావించిన మంచు విష్ణు తన సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించాడు.
ఇక మూడున రావానేది తన నిర్ణయం కాదని, ఆ తేదీ ఎలా బయటకు వచ్చిందో తనకు తెలియదు అంటూ ఏకంగా ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రకటించాడు.
కొన్ని రోజుల ముందు ప్రెస్‌మీట్‌లో ఈ సినిమాను జులై 17 లేదా 24న విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు.
‘బాహుబలి’ భారీ హంగామా లేని పక్షంలో ఈనెల 17న విడుదల చేయాని భావించాడు.కాని ‘బాహుబలి’ కలెక్షన్స్ ప్రభంజనంలా ఉన్నాయి.
దాంతో తన నిర్ణయంను వాయిదా వేసుకున్నాడు.ఈనె 24న తన సినిమాను విడుదల చేయాలని విష్ణు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.అదే రోజు అల్లరోడు తన ‘జేమ్స్‌బాండ్’ సినిమాను కూడా దించే ప్రయత్నంలో ఉన్నాడు.24వ తారీకుకు మరో 10 రోజు సమయం ఉన్న నేపథ్యంలో మరి కొన్ని కొత్త సినిమాలు కూడా యాడ్ అయ్యే అవకాశాలున్నాయి.మరి ఈ పోటీతో మంచు హీరో ఉంటాడా లేక తన సినిమాను మళ్లీ వాయిదా వేసుకుంటాడా అనేది చూడాలి.







