మేనమామ ఇలాకాలో అల్లుడు

ఎవరీ మేనమామ? ఎవరీ అల్లుడు? మేనమామ పేరు రాహుల్‌ గాంధీ.ప్రస్తుతం కాంగ్రెసు ఉపాధ్యక్షుడు.

 Priyanka Vadra’s Son Pays A Surprise Visit To Amethi-TeluguStop.com

మేనల్లుడి పేరు రెహాన్‌.రాహుల్‌ సోదరి ప్రియాంక వాద్రా కుమారుడు.

పద్నాలుగేళ్ల రెహాన్‌ ఉన్నట్లుండి రాహుల్‌ నియోజకవర్గమైన అమేథీకి వెళ్లాడు.ఇతను స్నేహితులతో కలిసి కారులో వెళ్లినట్లు కాంగ్రెసు పార్టీ వర్గాల సమాచారం.

రెహాన్‌ అమేథీ నియోజకవర్గంలోని ఒక గ్రామానికి వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నాడు.వారితో చర్చించాడు.

వారితో కలిసి భోజనం చేశాడు.అమేథీలో సంజయ్‌ గాంధీ ఆస్పత్రికి చెందిన అతిథి గృహానికి వెళ్లాడు.

రెహాన్‌ అమేథీ పర్యటన గురించి మీడియాకు కూడా ఆలస్యంగా తెలిసింది.నిజానికి ఆయన నాలుగు రోజుల కిందటే అమేథీకి వెళ్లాడు.

కాని దీన్ని కాంగ్రెసు నాయకులు గోప్యంగా ఉంచారు.ప్రియాంక కుమారుడి పర్యటన అమేథీ ప్రజలను ఆశ్చర్యపరిచింది.

మేనమామే ఎప్పుడో గాని వెళ్లడు.అలాంటిది అతని మేనల్లుడు వచ్చాడంటే ఆశ్చర్యమే కదా మరి….! అమేథీకి రాహుల్‌ కంటే తల్లి సోనియా, సోదరి ప్రియాంక తరచుగా వెళుతుంటారు.రెహాన్‌ అమేథీకి కావడంపై ఒక కాంగ్రెసు నాయకుడు మాట్లాడుతూ….రెహాన్‌ ఇక్కడికి రావడాన్నిబట్టి ఈ నియోజకవర్గం సోనియా గాంధీ కుటుంబానికి ఎంత ముఖ్యమైందో అర్థమవవుతోంది అన్నాడు.వారు ఇక్కడి ప్రజలతో సంత్సంబంధాలు కలిగివున్నారని చెప్పాడు.

పులి కడుపున పులే పుడుతుంది అన్నట్లుగా రాజకీయ కుటుంబాల్లోని పిల్లలకు రాజకీయాలపైనే ఆసక్తి ఉంటుందేమో….!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube