అక్కినేని హీరో ‘దూకుడు’

అక్కినేని హీరో అఖిల్‌ అతి త్వరలో తన మొదటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు.అఖిల్‌ మొదటి సినిమాకు వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే.

 Srinu Vaitla To Direct Akhil Akkineni 2nd Movie-TeluguStop.com

భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ దాదాపుగా పూర్తి కావచ్చినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్పుకొచ్చారు.

దసరా కానుకగా అఖిల్‌ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇక ఈ సినిమా తర్వాత అఖిల్‌ తన తర్వాత సినిమాను శ్రీనువైట్ల దర్శకత్వంలో చేసేందుకు కమిట్‌ అయ్యాడు.

‘దూకుడు’ వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత శ్రీనువైట్ల వరుసగా ఫ్లాప్‌ అవుతూ వస్తున్నాడు.అయితే ప్రస్తుతం రామ్‌చరణ్‌తో చేస్తున్న సినిమాపై భారీ అంచనాలున్నాయి.

అంచనాలకు తగ్గట్లుగానే మెగా పవర్‌ స్టార్‌తో భారీ స్థాయిలో సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఇక చరణ్‌, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఆ తర్వాత వెంటనే అఖిల్‌తో సినిమా ప్రారంభించే అవకాశాలున్నాయని అంటున్నారు.ఇప్పటికే వీరిద్దరి మద్య కథ చర్చలు కూడా జరిగాయని అక్కినేని ఫ్యామిలీ సన్నిహితుల ద్వారా సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube