వసుంధర రాజె ఇంత పని చేశారా....?

కాంగ్రెసు పార్టీకి ఐపీఎల్‌ మాజీ అధినేత లలిత్‌ మోడీ అవినీతి వ్యవహారం, దీంతో సంబంధం ఉన్న విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజే నిర్వాకాలు లడ్డూల్లా దొరికాయి.

ఈ మొత్తం ఎపిసోడ్‌ని ఆ పార్టీ పీకి పాకం పెడుతోంది.

నరేంద్ర మోదీ సర్కారుపై చెలరేగిపోతున్న కాంగ్రెసు లలిత్‌ మోడీ-సుష్మా-వసుంధన అవినీతి బంధాన్ని విజయవంతంగా ఎడగడుతోంది.దీంతో మోదీ సర్కారు ఏం మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది.

వసుంధరకు ఢిల్లీలో మోదీ, ఇతర భాజపా పెద్దలు అప్పాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదు.తాజాగా కాంగ్రెసు మరో బాంబు పేల్చింది.

ఇది మరో అవినీతి వ్యవహారం.మోసం కూడా.

Advertisement

రాజస్థాన్‌లో రాజ వంశానికి చెందిన ధోల్‌పూర్‌ మహల్‌ అనే రాజభవనం ఉంది.ఇది ఏనాడో ప్రభుత్వపరమైంది.

దీన్ని ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించారు కూడా.అయితే వసుంధర, ఆమె కుమారుడు దుష్యంత్‌, లలిత్‌మోడీ కలిసి దాన్ని ఆ భవనాన్ని తమ పేర మార్చుకొని, లగ్జరీ హోటల్‌ చేశారట.! ఈ భవనాన్ని ఆరుసార్లు ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించినట్లు కాంగ్రెసు నాయకుడు జైరాం రమేష్‌ చెప్పారు.

ఈ భవనం వసుంధర రాజేది కాదనేందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు.వసుంధర మాజీ భర్త కూడా ధోల్‌పూర్‌ మహల్‌ వసుంధర సొంతం కాదని కోర్టులో చెప్పాడట.! వసుంధర అండ్‌ కో వంద కోట్లు ఖర్చు పెట్టి ఈ భవనాన్ని లగ్జరీ హోటల్‌గా మార్చిందని జైరాం రమేష్‌ చెప్పారు.

దీనికి సంబంధించి ఇంకా చాలా కథ ఉందనుకోండి.సారాంశం ఇదీ.మరి దీనిపై వసుంధర ఏమంటారో చూడాలి.

కూటమి మేనిఫెస్టో చూసి విస్తుపోతున్న ఏపీ ప్రజలు.. ఇవి అమలు చేస్తే శ్రీలంక కాదా అంటూ?
Advertisement

తాజా వార్తలు