ఏపీలో టీఆర్‌ఎస్‌ పార్టీ

ఆంధ్రప్రదేశ్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఉందా? దానికో అధ్యక్షుడు ఉన్నాడా? ఈ ప్రశ్నలు విచిత్రంగా ఉన్నాయి కదా…! టీఆర్‌ఎస్‌ తెలంగాణకే పరిమితమైన పార్టీ.తెలంగాణ కోసం పోరాడిన పార్టీ.

 Ys Jagan Is Called Trs President Of Ap-TeluguStop.com

అది ఆంధ్రాలో ఎలా ఉంటుంది? కాని ఉందని అంటున్నారు ఆంధ్రప్రదేశ్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ ఉపాధ్యక్షుడు సతీష్‌ రెడ్డి.వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఏపీలో టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారట….! ఆయన పూర్తిగా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మద్దతు ఇస్తున్నారని, అందుకే ఆంధ్రా టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నామని అన్నారు.రేవంత్‌ రెడ్డి ముడుపుల బాగోతం బయటపడినప్పటి నుంచి కేసీఆర్‌కు జగన్‌ పూర్తిగా మద్దతు ఇస్తున్నారు.

ఇద్దరికీ ఉమ్మడి శత్రువు చంద్రబాబు నాయుడే కదా…! తెలంగాణలో టీడీపీ ఉండకూడదనేది కేసీఆర్‌ కోరిక.ఆంధ్రాలో టీడీపీ ఉండకూడదనేది జగన్‌ లక్ష్యం.అందుకే చంద్రబాబుపై కేసీఆర్‌ తీసుకునే అన్ని చర్యలను జగన్‌ సమర్థిస్తున్నారు.తన మీడియాను అందుకు ఉపయోగిస్తున్నారు.

నోటుకు ఓటు కేసులో బాబుకు శిక్ష పడితే చూడాలని జగన్‌ కోరిక.అందుకే తన మీడియా ‘సాక్షి’ ద్వారా లోగుట్టు వెలికి తీస్తూ కేసీఆర్‌కు సహకరిస్తున్నారు.

ఆయనకు ‘నమస్తే తెలంగాణ’ ఉందనుకోండి.అయినప్పటికీ సాక్షి కథనాలు కూడా విచారణలో ఉపయోగపడతాయి కదా…!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube