ప్రస్తుతం సినీ ప్రముఖుల నుండి సాదారణ ప్రేక్షకుల వరకు అంతా కూడా ‘బాహుబలి’ గురించే మాట్లాడుకుంటున్నారు.టాలీవుడ్ జక్కన్న ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాపై తెలుగుతో పాటు తమిళ మరియు బాలీవుడ్ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది.
సినిమా ప్రారంభం నుండి కూడా ఈ సినిమాపై భారీగానే ఉన్నాయి.అయితే తాజాగా ట్రైలర్ విడుదల తర్వాత అంచనాలు తారా స్థాయికి వెళ్లాయి.
ఈ సినిమాకున్న క్రేజ్ దృష్ట్యా డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌కు భారీ డిమాండ్ ఉంది.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏదైనా ఏరియాకు దక్కించుకోవాలని వందల సంఖ్యలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు మరియు నిర్మాతలు పోటీ పడుతున్నారు.
ఇలాంటి సినిమా డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నారు.
ఈ సినిమాను ప్రముఖ నిర్మాత, టాలీవుడ్ కింగ్ నాగార్జున కృష్ణ జిల్లాలో డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నాడు.
ఎంతో మంది పోటీ పడ్డాకాని, నాగార్జున ఈ సినిమాపై ఆసక్తి చూపడంతో నిర్మాతలు ఆయనకు ఈ సినిమాను ఇచ్చినట్లుగా తెలుస్తోంది.కృష్ణ ఏరియాకు గాను ఇప్పటి వరకు ఏ సినిమాకు కూడా 2.5 కోట్లకు అధికంగా పలకలేదు.కాని ‘బాహుబలి’కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈసినిమాను నాగార్జున ఏకంగా నాలుగు కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.
అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ సినిమాను పంపిణీ చేయబోతున్నారు.ఇక ఇతర ఏరియాల్లో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో అమ్ముడు పోతోంది.







