తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘బాహుబలి’ ఆడియో విడుదల మే 31న జరగాల్సి ఉంది, కాని పోలీసుల అనుమతి లభించక పోవడంతో వాయిదా పడ్డ విషయం తెల్సిందే.ముందు నుండి అనుకుంటున్నట్లుగానే ఈ సినిమా ఆడియోను భారీగా విడుదల చేసేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు.
వేల సంఖ్యలో ఫ్యాన్స్ హాజరు కానున్న ఈ ఆడియో ఫంక్షన్‌కు సిటీలో అనుమతి దక్కడం కష్టంగా ఉంది.అందుకే ఈ ఆడియో వేడుకను సిటీ ఔట్‌స్కట్స్‌లో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించాలని జక్కన్న వ్యూహంగా కనిపిస్తోంది.
ఆడియో ఫంక్షన్‌కు రావాలనుకునే వారికి రామోజీ ఫిల్మ్ సిటీ అయితే ప్లెక్‌బుల్‌గా ఉంటుందని అంటున్నారు.ఇక ఈ ఆడియో వేడుక కోసం ఒక భారీ సెట్టింగ్‌ను నిర్మిస్తున్నారు.
ఆడియో విడుదల కార్యక్రమం కోసమే జక్కన్న కోటి ఖర్చు చేస్తున్నట్లుగా ముందు నుండి కూడా ప్రచారం జరుగుతూ వస్తోంది.జక్కన్న ఏం చేసినా రిచ్‌గా ఉంటుందనిపించుకునేలా ఈ సినిమా ఆడియో ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.
ఈనెల 10న ఆడియో విడుదల కార్యక్రమం, రామోజీఫిల్మ్ సిటీలో జరుగబోతుందని జక్కన్న టీం అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి.ఈ సినిమాను వచ్చే నెల 10న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే.







