కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు త్వరలో హీరోగా ఒక సినిమా చేసేందుకు సిద్దం అవుతున్నాడు.గత సంవత్సరం ‘రౌడీ’ తర్వాత కెమెరా ముందుకు రాని మోహన్‌బాబు మళ్లీ ఇన్నాళ్లకు మొహానికి రంగు వేసుకోబోతున్నాడు.
ఈయన హీరోగా నటించి చాలా కాలం అయ్యింది.అయితే కామెడీ చిత్రాల దర్శకుడు శ్రీనివాస రెడ్డి చెప్పిన కథ నచ్చడంతో మరోసారి హీరోగా నటించాలనే కోరిక బాబుకు కలిగినట్లుగా తెలుస్తోంది.
‘ఢమరుకం’ సినిమా తర్వాత శ్రీనివాసరెడ్డి మరో సినిమా ఇప్పటి వరకు వచ్చింది లేదు.ఈయన ఆ మద్య అక్కినేని నాగచైతన్యతో ‘దుర్గ’ సినిమాను మొదలు పెట్టాడు.
కాని అది ఆదిలోనే ఆగిపోయింది.
పలువురు హీరోలకు ఈయన కథలు వినిపించినా కూడా వారు ఈయనతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు.
ఎట్టకేలకు ఈయన దర్శకత్వంలో మోహన్‌బాబు నటించేందుకు ఓకే చెప్పాడు.అయితే తాత వయస్సులో హీరో పాత్రలు చేయడం ఏంటని కొందరు గుసగుసలాడుకుంటున్నారు.
కొడుకులు హీరోలుగా నటిస్తున్న ఈ సమయంలో వయస్సుకు తగ్గ పాత్రలు చేయడం సంస్కారం అనిపించుకుంటుందని కొందరు మోహన్‌బాబుకు సలహాలు ఇస్తున్నారు.అయినా మోహన్‌బాబు ఒకరి సలహాలు వినే రకమా చెప్పండి.
తనకు నచ్చిందేదో చేసుకుని వెళ్లేరకం కాని.ఈయన హీరోగా తెరకెక్కబోతున్న సినిమాను ఆయన తనయుడు మంచు విష్ణు నిర్మించబోతున్నాడు.
ఈ సినిమాకు చెందిన అధికారిక ప్రకటన అతి త్వరలో వెలువడనుంది.







