పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘ఆంధ్రాపోరి’.ఈ సినిమాను ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ సినిమా టైటిల్ వైవిధ్యభరితంగా ఉండటంతో ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా క్రియేట్ చేసింది.అయితే ఇప్పుడు ఆ టైటిల్ వివాదాస్పదం అవ్వడంతో సినిమా విడుదల అయ్యేదే కష్టంగా మారింది.
ఈ సినిమా టైటిల్ తమ మనోభావాలను దెబ్బ తీసేలా ఉంది అంటూ మహిళ సంఘాల నేతలు హైకోర్టును ఆశ్రయించారు.
తెలుగు ఫిల్మ్ చాంబర్‌ను ఈ సినిమా టైటిల్ మార్పించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలంటూ మహిళ సంఘం వారు హైకోర్టును వేడుకున్నారు.
ఈ పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు ఇరు వర్గాల వాదనలు వినేందుకు ఓకే చెప్పింది.ఇప్పటికే సినిమా నిర్మాతతో టైటిల్ మార్చాల్సిందిగా తాము మాట్లాడాం అని, అయితే అందుకు ఆయన నో చెప్పడంతో ఇలా కోర్టుకు రావాల్సి వచ్చిందని సదరు మహిళ సంఘం నేతలు అంటున్నారు.
ఈ వ్యవహారం ఎక్కడకు దారి తీస్తుందో అని చిత్ర యూనిట్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమా నెల 5న విడుదల కావాల్సి ఉంది.







