ఇద్దరు రాజాల ప్రొడక్షన్‌ హౌస్‌

ఇటీవలే మా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టబోతున్నాడు.తనకు అత్యంత ఆప్తుడు అయిన శివాజీ రాజాతో కలిసి ఆర్‌.

 Raja And Raja Productions Launched-TeluguStop.com

ఆర్‌ ప్రొడక్షన్స్‌ను స్థాపించారు.ఈ బ్యానర్‌లో మొదటగా బుల్లి తెర కార్యక్రమాలు మరియు సీరియల్స్‌ను నిర్మించబోతున్నారు.

వీరిద్దరు కలిసి నిర్మిస్తున్న మొదటి కార్యక్రమం త్వరలోనే ఈటీవీలో ప్రసారం కాబోతుంది.ఇక మరో రెండు సీరియల్స్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సీరియల్స్‌తో పాటు సినిమాలను సైతం వీరి నిర్మాణంలో తీసుకు రావాలని ప్రయత్నాల చేస్తున్నారు.మా అధ్యక్షుడిగా ఉన్న రాజేంద్ర ప్రసాద్‌ ఒకవైపు నటిస్తూనే మరోవైపు ఇలా నిర్మాణంలోకి అడుగు పెట్టాడు.

శివాజీ రాజా ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో కార్యదర్శిగా ఎన్నిక అయ్యాడు.ఈయన కూడా సినిమాల్లో నటిస్తూ, అప్పుడప్పుడు బుల్లి తెరపై సందడి చేస్తూ ఉన్నాడు.

వీరిద్దరు కలిసి ప్రారంభించబోతున్న ఈ ప్రొడక్షన్‌ హౌస్‌ సక్సెస్‌ కావాలని మనమూ కోరుకుందాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube