‘జ్యోతిలక్ష్మి’ కోసం రానున్న చిరు??

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం తన 150వ సినిమా ఏర్పాట్లలో ఉన్నారు.గత కొంత కాలంగా ఈయన మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నాడు.

 Chiru To Attend Charmi Jyothi Lakshmi Audio-TeluguStop.com

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈయన జూన్‌ 4న మీడియా ముందుకు వచ్చే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది.జూన్‌ 4న పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జ్యోతిలక్ష్మి’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో మెగాస్టార్‌ చీప్‌ గెస్ట్‌గా పాల్గొనే అవకాశాలున్నాయని విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.

చిరంజీవి 150వ సినిమాకు పూరి దర్శకత్వం వహించబోతున్న విషయం తెల్సిందే.ఆ అనుబందంతోనే పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆడియోను విడుదల చేసేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఛార్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను జూన్‌ 12న విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది.ఈ సినిమా ట్రైలర్‌ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు తారా స్థాయిలో వచ్చాయి.

ఈ సినిమాలో ఛార్మి వేశ్య పాత్రలో కనిపించనుంది.చాలా మాస్‌గా ఛార్మి పాత్ర ఈ సినిమాలో ఉంటుందని దర్శకుడు పూరి చెబుతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube