యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘టెంపర్’ తర్వాత నటించబోతున్న సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.చాలా సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ ‘టెంపర్’తో తన టెంపర్‌ను చూపించాడు.
దాంతో తర్వాతి సినిమాపై సహజంగానే అంచనాలు తారా స్థాయిలో వస్తాయి.అందుకు తగ్గట్లుగానే ఎన్టీఆర్ తన తర్వాత సినిమాను సుకుమార్ దర్శకత్వంలో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
సుకుమార్ గత చిత్రం ‘1’ ఆశించిన స్థాయి ఫలితాన్ని ఇవ్వక పోయినా కూడా ఆయన దర్శకత్వంకు మంచి మార్కులు పడ్డాయి.దాంతో ఎన్టీఆర్‌తో సుక్కు చేయబోతున్న సినిమాపై కూడా అంచనాలు పెరిగి పోయాయి.
‘టెంపర్’ సినిమా విడుదల అయిన వెంటనే ఎన్టీఆర్, సుకుమార్‌ల సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయని అంతా భావించారు.కాని సుకుమార్ స్క్రిప్ట్‌లో పదే పదే మార్పులు, చేర్పులు చేస్తూ సినిమాను ఇప్పటి వరకు కూడా ప్రారంభించింది లేదు.
అయితే కొన్ని రోజుల ముందు స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యిందని, లొకేషన్స్ వెదికే పనిలో ఉన్నాను అని, మే చివరి వారంలో సినిమాను ప్రారంభిస్తాను అంటూ సుకుమార్ స్వయంగా ప్రకటించాడు.అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మే చివరి వారంలో ఎన్టీఆర్, సుకుమార్‌ల సినిమా ప్రారంభం కావడం లేదు.
జూన్‌లో ఎన్టీఆర్‌తో కొత్త సినిమాను సుకుమార్ ప్రారంభిస్తాడని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.ఈ సినిమా మరింత లేట్ అవుతుండటంతో నందమూరి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.







