యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈసారి తన బర్త్‌డే కానుకగా తన కొడుకు అభయ్ రామ్ లుక్‌ను విడుదల చేశాడు.రేపు ఎన్టీఆర్ పుట్టిన రోజు.
ఈ సందర్బంగా ఈరోజు సాయంత్రం అయిదు గంటలకు అభయ్ రామ్ ఫొటోలను ఎన్టీఆర్ తన ఫేస్‌బుక్ అఫిషియల్ ఫేజ్‌లో పోస్ట్ చేశాడు.ఈ సందర్బంగా అభిమానులతో, శ్రేయోభిలాషులతో తన సంతోషాన్ని పంచుకున్నాడు.
అభయ్ రామ్ పుట్టి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క ఫొటో మీడియా ముందుకు వచ్చింది లేదు.ఇన్నాళ్లకు అభయ్ రామ్ ఫొటో వస్తుందని మూడు రోజుల ముందుగానే తెలియడంతో భారీ ఆసక్తిగా ఎదురు చూశారు.
అభయ్ రామ్ పేరుతో సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో భారీ ట్రేడిరగ్ జరిగింది.నందమూరి ఫ్యామిలీ నుండి వచ్చిన ఈ బుల్లి యంగ్ టైగర్‌ను చూసిన తెలుగు ప్రేక్షకులు, నందమూరి ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు.
ఈ బర్త్‌డేకు గొప్ప బహుమతి ఇచ్చినందుకు ఎన్టీఆర్‌కు ఫ్యాన్స్ కృతజ్ఞతలు చెబుతున్నారు.







