హాట్‌ సబ్జెక్టు ఆథ్యాత్మికమే...!

ఇప్పుడు సమాజంలో బాగా డిమాండ్‌ ఉన్న సబ్జెక్టు, వ్యాపార రీత్యా కూడా బాగా హాట్‌ సబ్జెక్టు ఆథ్యాత్మికమే.అంటే స్పిరిచ్యువాలిటీ.

 Andhra Pradesh Plans Theme Park At Tirupati-TeluguStop.com

ఆధునికత , సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ అంతకుమించి ఆథ్యాత్మికత కూడా పెరుగుతోంది.మీడియాలోనూ ఎక్కువ డిమాండ్‌ ఉంది.

న్యూస్‌, వినోదాత్మక ఛానెళ్ల కంటే భక్తి ఛానెళ్లను ఎక్కువమంది చూస్తున్నారు.ప్రింట్‌ మీడియలోనూ ఆథ్యాత్మిక పేజీలు లేని న్యూస్‌ పేపరు, మేగజైన్‌ ఉండదు.

భక్తి వ్యాపారమంత బ్రహ్మాండమైన వ్యాపారం మరొకటి లేదు.ఒకప్పుడు పరమ నాస్తికుడైన ‘ఈనాడు’ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు సైతం ఆథ్యాత్మికవేత్తగా మారిపోయారు.

ఫిలింసీటీలో ‘ఓం సిటీ’ పేరుతో ప్రపంచంలోనే అతి పెద్దదైన ఆథ్యాత్మిక నగరాన్ని నిర్మించాలని సంకల్పించారు.ఇందులో వ్యాపారం కూడా ఇమిడిఉందనే సంగతి తెలిసిందే.

ఒక వ్యక్తే ఇలాంటి నగరం నిర్మిస్తున్నప్పుడు ప్రభుత్వాలు నిర్మించవా? ఏపీ ప్రభుత్వం ఈ పనే చేయబోతోంది.పుణ్యక్షేత్రమైన తిరుపతి వద్ద మూడొందల యాభైఐదు కోట్ల ఖర్చుతో మైథలాజికల్‌ థీమ్‌ పార్కును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

దీంట్లో అన్ని దేవతల, అన్ని రకాల ఆలయాలు ఉంటాయి.తిరుపతి వెంకన్నను దర్శించుకునే భక్తులు ఈ థీమ్‌ పార్కును చూడకుండా ఉంటారా? ఇదొక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి అవుతుంది.ప్రస్తుతం తెలంగాణలోని యాదగిరి గుట్ట దగ్గర ఇలాంటి థీమ్‌ పార్కు ఉంది.ఓ భక్త కుటుంబం దాన్ని ఏర్పాటు చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube