స్మృతి అడుగుజాడల్లో రాహుల్‌ గాంధీ?

కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అడుగుజాడల్లో నడుస్తున్నారా? ఏమో…ఈ సంగతి మనకు తెలియదు.ఆయన నడిస్తే తన తల్లి సోనియా గాంధీ అడుగుజాడల్లో నడుస్తారు.

 Rahul Gandhi Is Following In My Footsteps-TeluguStop.com

కాని స్మృతి ఇరానీ అడుగుజాడల్లో నడుస్తారా? కాని ఈ సంగతి ఆమే చెప్పారు.అయితే తనను ఎలా ఫాలో అవుతున్నారో వివరించలేదు.

రాహుల్‌ పార్లమెంటరీ నియోజకవర్గమైన అమేథీలోనే స్మృతి ఇరానీ ఆయనపై విమర్శలు చేశారు.యువరాజును ఆమె ఎం.ఐఎ.అని సంబోధించారు.ఈ మాటకు అర్థం ‘మిస్సింగ్‌ ఇన్‌ యాక్షన్‌’.ఒక్కమాటలో చెప్పాలంటే రాహుల్‌ ఏం పనిచేయడంలేదని అన్నారు.రాహుల్‌ మూడు నెలలుగా అమేథీకి రాలేదని విమర్శించారు.రాహుల్‌ పర్యటనకు ఆరు రోజుల ముందు ఈమె అమేథీలో పర్యటించారు.

అంటే మంత్రి పర్యటన ముగిశాక రాహుల్‌ వస్తారు.ఆ ఉద్దేశంతోనే కావొచ్చు ‘రాహుల్‌ నా అడుగుజాడల్లో నడుస్తున్నారు’ అని స్మృతి వ్యాఖ్యానించారు.

గత సాధారణ ఎన్నికల్లో స్మృతి ఇరానీ అమేథీలో రాహుల్‌ గాంధీపై పోటీ చేసి ఓడిపోయారు.అయినప్పటికీ రాహుల్ మీద ఓడిపోవడం కూడా గెలుపేనని భావించిన ప్రధాని మోదీ ఆమెకు మంత్రి పదవి ఇచ్చారు.

రాహుల్‌ విదేశాల నుంచి తిరిగొచ్చాక భాజపా నాయకులు ఆయన్నే టార్గెట్‌గా పెట్టుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube