పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు జీవన్మరణ సమస్యగా మారింది.దీన్ని ఎలాగైనా పూర్తి చేసి తీరుతామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.
కేంద్ర ప్రభుత్వమూ ఈ మాటే అంటోంది.యూపీఏ ప్రభుత్వం రాష్ర్ట విభజన సమయంలో ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో చేర్చింది.
దీనికి జాతీయ హోదా కల్పిస్తామని భాజపా, మోదీ ప్రభుత్వం చెప్పాయి.పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తామని కేంద్ర నీటి వనరుల శాఖ మంత్రి ఉమాభారత గురువారం లోక్‌సభలో హామీ ఇచ్చారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఈ ఏడాది మార్చి నెలాఖరునాటికి దాదాపు ఆరువేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు.ఈ ప్రాజెక్టు పూర్తయితే రెండు లక్షల హెక్టార్లకు పైగా సాగు నీరు అందడమే కాకుండా తొమ్మిది వందల అరవై మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది.
పోలవరం మొదటి నుంచి వివాదాస్పద ప్రాజెక్టుగా ఉన్న సంగతి తెలిసిందే.దీన్ని తెలంగాణ కూడా వ్యతిరేకిస్తోంది.
వందలాది గ్రామాలు ఈ ప్రాజెక్టుగా కారణంగా మునిగిపోతాయి.తెలంగాణలోని ఏడు మండలాలను పోలవరం ముంపు మండలాలుగా గుర్తించి వాటిని ఏపీలో కలిపేశారు కూడా.
అక్కడి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.అక్కడి ఉద్యోగులు తమను తెలంగాణకు పంపించేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎప్పుడో బ్రిటిషువారి పాలనలో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు దశాబ్దాలు గడిచినా ఇంకా వివాదాల్లో నలుగుతూనే ఉంది.బాబు పరిపాలనలో ఇది పూర్తయ్యేది అనుమానమే…!
.






