వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినీ కెరీర్ ప్రారంభించిన 25 సంవత్సరాలు పూర్తి అయ్యింది.ఇన్ని సంవత్సరంలో వర్మ ఎన్నో సినిమాలు తెరకెక్కించాడు.
అయితే వాటిల్లో ఏ ఒక్కదానికి కూడా క్లీన్ యు సర్టిఫికెట్ వచ్చింది లేదు.ఎక్కువ ఎ సర్టిఫికెట్ సినిమాలు చేసిన రామ్ గోపాల్ వర్మ తాజాగా క్లీన్ యూ సర్టిఫికెట్ సినిమా మొదటి సారి చేశాడు.
తాజాగా వర్మ తెరకెక్కించిన ‘365 డేస్’ సినిమాకు క్లీన్ యు సర్టిఫికెట్ వచ్చింది.ఈ విషయాన్ని వర్మ స్వయంగా ట్విట్టర్‌లో ప్రకటించాడు.
తాను సినీ కెరీర్ ప్రారంభించిన 25 సంవత్సరాల్లో మొదటి సారి తన సినిమాకు క్లీన్ యు సర్టిఫికెట్ వచ్చింది అంటూ వర్మ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.ఈ సినిమాలో క్రైమ్ లేకుండా, కేవలం ఫ్యామిలీ ఎమోషన్స్‌తోనే తెరకెక్కించాను అని, అందుకే క్లీన్ యు సర్టిఫికెట్ వచ్చింది అని వర్మ చెప్పుకొచ్చాడు.
చాలా కాలం తర్వాత క్రైమ్ లేకుండా సినిమా చేశాను అని అన్నాడు.సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను మే 15న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటికే ఆడియో విడుదలైంది.ఈ సినిమాలో హీరోగా నందు, హీరోయిన్‌గా అనైకలు నటించారు.







